స్వయంవర ప్రాంగణం సందడిగా ఉంది. ఎక్కడెక్కడి నుండో వస్తున్న రాకుమారుల అందాల వెలుగులతో నిండి ఉంది. అదే సమయంలో ఉత్కంఠతో వాతవరణం వేడివేడిగా ఉంది. ''ఎవరు గెలుస్తారు? ఆ భువనైక సుందరి చేయిపట్టుకునే అదృష్టవంతుడెవరో!'' ఎడతెగని ఊహలు.. అంచనాలు ఈలోపే నవ్వులు'' అటు చూడండి. పృథ్వీరాజ్ చౌహాన్'' స్వయం వరం జరిగే మందిరం ముందు.. మట్టితో చేసిన పృథ్వీరాజ్ నిలువెత్తు రూపం కనిపిస్తోంది. వీరుడిగా కాదు. ద్వార పాలకుడి రూపంలో! ఢిల్లీ, అజ్మీర్.. రెండు రాజధానులతో రాజ్య పాలన చేస్తున్న వీరుడిని ద్వారపాలకుడి రూపంలో చూడడం కొంతమందికి నచ్చలేదు. . అతనిపై కోపం, అసూయ ఉన్న వాళ్లకు మాత్రం బాగా నచ్చింది. కనౌజ్(ఉత్తరప్రదేశ్) రాకుమారి సంయుక్త అందానికి మారుపేరైతే, పృథ్వీ రాజ్ చౌహాన్ వీరత్వానికి నిలువెత్తు నిర్వచనం. చౌహాన్ గురించి ఆ నోటా ఈ నోటా విన్న సంయుక్త.. అతడి ప్రేమలో పడిపోయింది.
వారిది అజరామర ప్రేమ కథ